Site icon NTV Telugu

Teja Sajja : ‘జాతి రత్నాలు’ కథ ఫస్ట్ నా దగ్గరకే వచ్చింది..!

Teja Jathi Rathnalu

Teja Jathi Rathnalu

టాలీవుడ్‌లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. తాజాగా థియేటర్లలో హిట్ టాక్ అందుకుంటున్న “లిటిల్ హార్ట్స్” లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. అయితే గత కొన్నేళ్లలో వినోదభరితమైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మూవీ “జాతి రత్నాలు”. అనుదీప్ కేవీ దర్శకత్వంలో, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది.

Also Read : Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ఓటీటీ అప్డేట్!

తెలుస్తున్న సమాచారం ప్రకారం.. “జాతి రత్నాలు” స్క్రిప్ట్ మొదటగా హీరో తేజా సజ్జ చేతికి వెళ్ళిందట. దీనిపై తేజ మాట్లాడుతూ – “ఆ రోల్‌ను నా కంటే బాగా ఎవ్వరూ చేయలేరని నేను భావించాను. నిజంగా నవీన్ పోలిశెట్టి దాన్ని అద్భుతంగా నటించాడు. సినిమాకు పూర్తి న్యాయం చేశారు” అని పేర్కొన్నాడు. అనుకున్నట్లుగా ఈ మూవీలో తేజ నటించి ఉంటే కనుక తనలో కొత్త కోణాలను చూసేవాళ్ళం. ఒక బ్లాక్‌బస్టర్ మూవీ మొదట మరో హీరో దగ్గరికి వెళ్లి, తరువాత ఇంకొకరి చేతుల్లోకి వెళ్లడం సినీ రంగంలో కొత్తేమీ కాదు. కానీ “జాతి రత్నాలు”లాంటి హిట్ సినిమా మొదట తేజ సజ్జ దగ్గరికి వెళ్లిందన్న విషయం మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా తేజ సజ్జ “హను మాన్” తో బ్లాక్‌బస్టర్ కొట్టి, ఇప్పుడు మరో సూపర్ హీరో మూవీ “మిరాయ్”తో సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వరుసగా వేరియేషన్ ఉన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే “జాతి రత్నాలు”*కు సంబంధించిన ఈ ఆసక్తికరమైన ఫ్యాక్ట్ బయటకు రావడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది.

Exit mobile version