NTV Telugu Site icon

Teja Sajja: మహేష్ తో క్లాష్ గురించి సూపర్ చెప్పాడు… హ్యాట్స్ ఆఫ్ మావా

Teja Sajja

Teja Sajja

2024 సంక్రాంతి బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ కి రెడీ అవుతోంది. ఫెస్టివల్ సీజన్ ని కాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా, ధనుష్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అయినా వెనక్కి తగ్గుతారు అనుకుంటే సంక్రాంతి సీజన్ బిజినెస్ లు ఇప్పటికే అయిపోవడంతో ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. రాబోయే పది రోజుల్లో ఏమైనా మార్పులు జరిగి, చర్చలు జరిగి రిలీజ్ డేట్లలో కాస్త ముందు వెనక్కి వస్తారేమో చూడాలి. ఇప్పటికి ఉన్న క్లారిటీ ప్రకారం అయితే అందరూ ఫిక్స్ చేసిన డేట్స్ కే వస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బంది పడుతుంది అనే వార్త గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది.

వాయిదా వేసుకోమంటున్నారు, సెన్సార్ అవ్వకుండా అడ్డు పడుతున్నారు అని డైరెక్ట్ గా ప్రశాంత్ వర్మనే చెప్పడంతో సోషల్ మీడియాలో హనుమాన్ రిలీజ్ హాట్ టాపిక్ అయ్యింది. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా సినిమాగా ప్రమోషన్స్ జరుపుకుంటున్న హనుమాన్ సినిమా హిందీ రిలీజ్ డేట్ ఆల్రెడీ లాక్ అయిపొయింది కాబట్టి ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఈ కారణంగానే హనుమాన్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అంత పట్టుబట్టి ఉంది. ఈ క్లాష్ విషయంలో తేజ సజ్జా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2000వ సంవత్సరం వచ్చిన మహేష్ బాబు నటించిన సినిమా యువరాజులో తేజ సజ్జా మహేష్ కి కొడుకు పాత్రలో కనిపించాడు… ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత అదే మహేష్ బాబుతో క్లాష్ కి దిగుతున్నాడు అనే మాట వినిపించడంతో… “ఆయనతో పోటీగా కాదు సర్… ఆయనతో పాటుగా” అంటూ తేజ సజ్జా సూపర్ రిప్లై ఇచ్చాడు. తేజ చెప్పిన సమాధానం మహేష్ అభిమానులని కూడా ఇంప్రెస్ చేసేలా ఉంది. మరి ఈ సినిమా ఎంత సాఫీగా రిలీజ్ అవుతుందో చూడాలి.

Show comments