Site icon NTV Telugu

Teja Sajja: కంటెంటే కింగు.. మిగతావన్నీ తర్వాతేనంటున్న తేజ సజ్జా

Teja Sajja

Teja Sajja

Teja Sajja Preferring Content Driven movies : బాల నటుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి నేనున్నానే నాయనమ్మ అంటూ చిట్టి డైలాగ్ ఇంద్ర సినిమాలో చెప్పి అందరికీ నచ్చేశాడు తేజ సజ్జా. ఆ సినిమానే కాదు అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అలాంటి తేజ హీరో అయ్యాడు. ముందు బేబీ సినిమాలో చిన్న పాత్ర చేసినా ఆ తరువాత జాంబీ రెడ్డి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటివరకు కేవలం హాలీవుడ్ కె పరిమితం అనుకున్న జాంబీ జానర్ సినిమా మనవాళ్లకు కొత్తే అయినా ఎక్కడా తగ్గకుండా ఆ సినిమాను ఆదరించి హిట్ చేశారు. ఆ తరువాత ఇష్క్ అనే సినిమాతో పాటు అద్భుతం అనే మరో సినిమా కూడా చేశాడు తేజ. ఈ రెండు సినిమాలు కూడా భిన్నమైనవి. ఒకరకంగా భిన్నమైన, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయి ప్రశాంత్ వర్మతో హనుమాన్ అనే సినిమా చేసాడు. ఆ సినిమా చిన్న సినిమాగా వచ్చి ఈరోజు తెలుగు సినీ చరిత్రలోనే ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డులను సెట్ చేసింది. దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా నెల రోజులు దాటినా ఇంకా చాలా థియేటర్ల్స్ లో ఆడుతోంది. ఇక 50 రోజుల దగ్గర పడుతున్న ఈ సినిమా తేజకి మాత్రమే కాదు సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఇక తేజ హీరో కాబట్టి మిగతా అందరి కంటే మనోడికి ఇంకా క్రేజ్ అయితే లభిస్తోంది.

Bullet Temple: బుల్లెట్ బండిని పూజించే గుడి.. ఎక్కడో తెలుసా?

ముఖ్యంగా తెలుగులో అనేక మంది దర్శక నిర్మాతలు తేజతో సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. తెలుగు మాత్రమే కాదు బాలీవుడ్ మేకర్స్ కూడా తేజను దృష్టిలో పెట్టుకుని కధలు రాసుకుని వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 300 కోట్ల సినిమాతో హిట్ కొట్టాడు కాబట్టి రెమ్యునరేషన్ కూడా కొంత పెంచాడని టాక్ అయితే ఉంది. నిజానికి తేజ రెమ్యూనరేషన్ కంటే కూడా కంటెంట్ మీదనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ ముఖ్యమే, కాస్త పెంచి ఇస్తారు సరే కానీ కంటెంట్ ముఖ్యం అని తేల్చి చెప్పేస్తున్నాడు అని తెలుస్తోంది. తన వద్దకు వచ్చిన అన్ని కథలను కాదనకుండా వింటూనే తనకు సెట్ కావు అనుకున్న వెంటనే సున్నితంగా తిరస్కరిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈగల్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ సినిమా ఉండనుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో సైతం తేజ కనిపించనున్నాడు. ఇక ఆ తరువాత ఎలాంటి సినిమాను ఫైనల్ చేయని తేజ కంటెంట్ నచ్చితేనే ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలను సైతం పక్కన పెట్టేస్తున్న ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాను మాత్రం ఆదరిస్తున్నారు. అందుకే తేజ కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్ముతున్నాడని తెలుస్తోంది.

Exit mobile version