NTV Telugu Site icon

Teja Sajja : ‘హనుమాన్’ మూవీ కోసం ఏకంగా 75 సినిమాలు వదులుకున్నా..

Whatsapp Image 2024 02 05 At 9.50.21 Pm

Whatsapp Image 2024 02 05 At 9.50.21 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “హనుమాన్”.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ మూవీ విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.సినిమా విడుదలై సుమారు 23 రోజులు అవుతున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.290 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి.. హీరోగా తేజా సజ్జాకి.. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. హనుమాన్ సక్సెస్ తో తేజా టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ప్రస్తుతం ఈ హీరోకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తేజ సజ్జ తాజా ఇంటర్వ్యూలో ‘హనుమాన్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

‘హనుమాన్’ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డ తేజ సజ్జా ఆ సమయంలో ఏకంగా 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. “హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా కూడా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారు. ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశాను. అయితే హనుమాన్ మూవీ బాక్సాఫీస్ నంబర్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ సినిమా ఆడియెన్స్ కు నచ్చిందా లేదా అనేదే చూశాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హనుమాన్ ఓవర్సీస్ లో భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం తేజ సజ్జాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు హీరోయిన్ అమృతా అయ్యర్ అమెరికాలో ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.

Show comments