NTV Telugu Site icon

Jayanth C. Paranjee : తీన్ మార్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదే…!!

A2d48180 436b 4bc8 A69e 64506d730716

A2d48180 436b 4bc8 A69e 64506d730716

జయంత్ సీ పరాన్జీ.ప్రేమించుకుందాం రా.. బావగారూ బాగున్నారా.. వంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే చాలా కాలంగా ఆయన మరో సినిమాను చేయలేదు.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్.. అదే స్థాయిలో ప్లాపులు కూడా అందుకున్నాడు.అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా ఒకటి. దశాబ్ద కాలం కితం థియేటర్లలో విడుదలైన ఈ పవర్ స్టార్ అభిమానులను బాగా నిరాశపరిచింది. అప్పట్లో మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న జయంత్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను దర్శకత్వం వహించిన లు హిట్స్, ప్లాప్స్ కావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే తీన్ మార్ ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ ను చేశారు.

“తీన్ మార్ రిజల్ట్ పక్కన పెడితే ఈ మూవీ కథ మాత్రం నాకిప్పటికీ కూడా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. అయితే ఆ మూవీ ఫెయిల్ కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మాత్రం నేను చెప్పలేను. నాకు తెలిసినంతవరకు అయితే పవర్ స్టార్ ఇమేజ్ కు మాత్రం ఇది సరిపోలేదు. కొంతమంది ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్ తో పెళ్లి చేయడం… ఆ తర్వాత ఆమె తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు వాళ్లకు అస్సలు నచ్చలేదు. ఒకవేళ ఇదే చిత్రాన్ని అప్పుడున్న యువ హీరోల్లో ఎవరో ఒకరితో కనుక తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో” అని అన్నారు.పవర్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన తీన్ మార్ లో త్రిష మరియు కృతి కర్బంద కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ కు రీమేక్ గా తీన్ మార్ ను తెరకెక్కించారు.అయితే బాక్సాఫీస్ వద్ద డిభారీ జాస్టర్ అయిన ఈ మ్యూజిక్ పరంగా మాత్రం చాలా బాగుంది అని చెప్పవచ్చు.