‘టీనా శ్రావ్య’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందుకు కారణం వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రమే. ఈ సినిమాలో శ్రావ్య హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశారు. పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ క్యారెక్టర్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షో హిట్ అవ్వడంతో శ్రావ్య ఖాతాలో మరో రెండు సినిమాలు చేరాయి.
Also Read: Off The Record: జనసేనకు వెన్నుపోట్లు?.. పవన్ కళ్యాణ్ స్పెషల్ క్లాస్ పీకారా?
టీనా శ్రావ్య ముందుగా ‘అగ్రికోస్’ చిత్రంలో నటించారు. అగ్రికోస్‌తో ఆమెకు పెద్దగా పాపులారిటీ రాకున్నా.. కమిటీ కుర్రోళ్లు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కమిటీ కుర్రోళ్లులో మంచి నటనతో ఆకట్టుకున్నారు. దాంతో ఆమెకు ప్రీ వెడ్డింగ్ షో అవకాశం వచ్చింది. అందులోనూ బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా హిట్ అయితే శ్రావ్యకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం పక్కా.
