NTV Telugu Site icon

Prabhas: టీజర్ వార్ పీక్స్‌.. షారుఖ్ vs ప్రభాస్

Prabhas

Prabhas

బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల గ్యాప్‌తో రాబోతున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, టీజర్ విషయంలో మాత్రం పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది సలార్. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఇన్ని రోజులు ఆదిపురుష్ కారణంగా సలార్ అప్డేట్స్‌ను హోల్డ్‌లో పెట్టారు. కానీ ఇప్పుడు సలార్ టైం స్టార్ట్ అయిపోయింది. జూలై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. జూలై 7న సలార్ టీజర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే రోజు.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ టీజర్‌ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలె పఠాన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. జవాన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 7న జవాన్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో జవాన్ టీజర్‌ను జులై 7న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్. అయితే ఒకే రోజు రెండు బిగ్ పాన్ ఇండియా సినిమాల టీజర్స్ బయటికి వస్తే.. టీజర్ వార్ పీక్స్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్‌. నిజంగానే ఒకే రోజు ఈ ఇద్దరు స్టార్ హీరోల టీజర్లు రిలీజ్ అయితే.. ఆరోజు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం పక్కా. ఏ టీజర్ బాగుంది? ఏది ఎక్కువ వ్యూస్ రాబట్టింది? అనే కంపారీజన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ జవాన్ కంటే సలార్ పైనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి.. సలార్‌ టీజర్‌దే సోషల్ మీడియాలో అప్పర్ హ్యాండ్ అయ్యేలా ఉంది.