Site icon NTV Telugu

Shaakuntalam : సామ్ బర్త్ డే స్పెషల్… ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్

Shaakunthalam

Shaakunthalam

సౌత్ క్వీన్ సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆమె నటిస్తున్న తాజా చిత్రాల నుంచి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విగ్నేష్ శివన్, నయనతారలతో కలిసి సామ్ నటించిన “కాతు వాకుల రెండు కాదల్” మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరోవైపు సమంత యువరాణిగా నటిస్తున్న “శాకుంతలం” నుంచి కూడా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో తెల్లటి దుస్తుల్లో, మల్లెపూలు అలంకరించుకుని, అందంగా కన్పిస్తోంది. మేకర్స్ అయితే పోస్టర్ తోనే సరిపెట్టేశారు. కానీ సామ్ ఫ్యాన్స్ కనీసం టీజర్ నైనా విడుదల చేస్తారేమోనని ఆసక్తిగా ఎదురు చూశారు.

Read Also : Kanmani Rambo Khatija Twitter Talk : ఎలా ఉందంటే ?

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక “శాకుంతలం”లో రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, వర్షిణి సౌందరరాజన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించనున్నారు. మరో వైపు సామ్ ఖాతాలో యశోద, సిటాడెల్, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలు ఉన్నాయి.

Exit mobile version