NTV Telugu Site icon

Project K: అన్నా.. అదే చేత్తో కొంచెం ప్రభాస్ లుక్ ను కూడా

Project K

Project K

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. సైన్స్ ఫిక్షన్ కథగా ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే అకేషన్ వచ్చినప్పుడల్లా చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదులుతూ అభిమానులకు శుబాకాంక్షలను తెలుపుతోంది. తాజాగా నేడు హోళీ పండగను సెలబ్రేట్ చేసుకొని చిత్ర బృందం ఒక ఫోటోను షేర్ చేసింది.

Raashi Khanna: అమ్మడు బాహుబలి చేసుంటే ఏ రేంజ్ లో ఉండేదో..

ప్రాజెక్ట్ కె సెట్ లో హోళీ సంబరాలు జరిగినట్లు తెలుస్తున్నాయి. మొత్తం టెక్నీషియన్స్ తో ఉన్న ఒక గ్రూప్ ఫోటోను మేకర్స్ పోస్ట్ చేస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇందులో కేవలం టెక్నీషియన్స్ మాత్రమే ఉండడంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అన్నా.. అదే చేత్తో కొంచెం ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తే మేము కూడా అంతే రంగులు చల్లుకొని పండగ చేసుకుంటాం అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Show comments