NTV Telugu Site icon

Teacher: 90స్ టీమ్ నుంచి మ‌రో న‌వ్వుల జ‌ల్లు.. క‌ల‌ర్స్ స్వాతి టైటిల్ రోల్లో ‘టీచర్’

Colors Swathi Teacher

Colors Swathi Teacher

Teacher Movie from #90s Team : ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో టీచర్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి ఈ సినిమా వస్తుండడంతో సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో అసలు సందేహం లేదని చెప్పొచ్చు.

Actress Samyuktha: స్త్రీ సాధికారత కోసం సంయుక్త “ఆదిశక్తి”

90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ డైరెక్టర్ ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం ఈ సినిమాను నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో ప్రాజెక్ట్ కాగా మొదటి సినిమా ఇది. స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులుకీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: అజీమ్‌ మహమ్మద్‌, సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్‌ సదాశివుని, ఎడిటర్‌: అరుణ్‌ తాచోత్‌, ఆర్ట్ డైరక్టర్‌: తిపోజి దివ్య, లిరిక్స్ : కందికొండ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రేఖ బొగ్గారపు ఇతర టెక్నీషియన్స్ గా పని చేస్తున్నారు.