గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతేడాది వైరస్ బారిన పడి స్వర్గస్తులయ్యారు. 2020, ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారినపడ్డ బాలు.. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో మనందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని అభిమానులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనను గుర్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
