NTV Telugu Site icon

RRR: 98 సెకండ్స్ లో 932 టికెట్స్ సోల్డ్ అవుట్… ‘ఆర్ ఆర్ ఆర్’ ది ఆల్మైటీ

Rrr

Rrr

రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎపిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్సృష్టించింది. కరోన కారణంగా దెబ్బ తిన్న ఇండియన్ ఫిల్మ్ గ్లోరిని తిరిగి తీసుకోని వస్తామని ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ ఏ టైంలో చెప్పారో కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్ సౌండ్ బౌండరీలు దాటి వినిపించడం మొదలయ్యింది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా, వెస్ట్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకి రానంత రీచ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి వచ్చింది. ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉన్న మన ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్ లో జెండా ఎగరేస్తోంది.

తాజాగా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ అయిన “ది క్రియేటివ్ లైఫ్, TCL చైనీస్ థియేటర్స్” లో జనవరి 9న స్క్రీనింగ్ కానుంది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణిల సమక్షంలో జరగనున్న ఈ స్క్రీనింగ్ టికెట్స్ సేల్ స్టార్ట్ అవ్వడం కోసం చాలా మంది ఎదురు చూసారు. అయితే ఊహించని రేంజులో హాట్ కేకుల్లా ‘ఆన్ లైన్ సేల్స్ స్టార్ట్ చేసిన 98 సెకండ్స్ లోనే 932 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి”. అంత త్వరగా టికెట్ సేల్స్ కంప్లీట్ అవ్వడంతో ఆశ్చర్యపోయిన బియాండ్ ఫెస్ట్ వాళ్లు “ఒక ఇండియన్ సినిమా స్క్రీనింగ్ కి ఈరెంజ్ బుకింగ్స్ రావడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయ్యింది కాబట్టి గతంలో ఇండియన్ సినిమాకి ఇలాంటి రీచ్ రాలేదు. సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యండి” అంటూ ట్వీట్ చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం రాజమౌళి అండ్ టీం లాస్ ఏంజిల్స్ వెళ్లారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడి మీడియా అండ్ ఆడియన్స్ తో ‘ఆర్ ఆర్ ఆర్ టీం’ Q&A’ సెషన్ లో పాల్గొననున్నారు.