Site icon NTV Telugu

NTR 30: గెట్ రెడీ బాయ్స్.. కత్తి పట్టి బరిలోకి దిగేస్తున్న తారక్

Ntr 30

Ntr 30

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు రేపు సమాధానం దొరకబోతోంది. క్రేజీ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకలి రేపటితో తీరబోతుంది. ఎన్టీఆర్ 30 అప్డేట్  తో రేపు తారక్ అభిమానులకు  పండగ మొదలైపోయింది. మే 20 ఎన్టీఆర్ అభిమానులకు పండగ.. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ అభిమానులు ఊరువాడా ఏకం చేసి కేకులు కట్ చేసి పండగ జరుపుకోనేరోజు. ఇక ఈరోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు. ఇక అదే రోజు వారు ఎదురు చూసే సినిమా అప్డేట్ కూడా వస్తే ఇక పూనకాలే. రేపు అదే జరగబోతోంది.

మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు  సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్  చిత్రంతో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ఎన్టీఆర్.. తన నెక్స్ట్ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో లో సూపర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఒక రివెంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరక్కిస్తున్నాడట కొరటాల.. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ” ”పిడుగుపాటుకు సర్వం సిద్ధమైంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30   అప్డేట్ ఈరోజు సాయంత్రం 7:02 గంటలకి రాబోతోంది. చూస్తూ ఉండండి!” అంటూ చెప్పి ఇంకా హైప్ పెంచారు. ఇక పోస్టర్ లో సైతం కట్టి పట్టి బరిలోకి దిగుతున్న ఎన్టీఆర్ చేతిని చూపించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. మరి ఈ సినిమా టైటిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో.. ఎన్టీఆర్ లుక్ ఎన్ని అంచనాలను రేకేత్తిస్తోందో చూడాలి.

Exit mobile version