Site icon NTV Telugu

Tarakratna: కబాలిగా మారిన ఎన్టీఆర్.. గుర్తుపట్టారా..?

Tarak

Tarak

Tarakratna: సడెన్ గా ఈ ఫోటో చూసి కబాలిలో రజినీకాంత్ లా ఉన్నాడు.. ఎవరు ఇతను అని అనుకుంటూ ఉన్నారా..? ఒక్కసారి తీక్షణంగా చూడండి.. మన ఎన్టీఆర్.. అదేనండీ నందమూరి తారకరత్న. గతకొన్ని రోజులుగా తారకరత్న కొత్త లుక్ నెట్టింట వైరల్ గా మారింది. తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక టీడీపీ తరుపున పోటీ చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నానని చెప్పిన తారకరత్న టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇంకో పక్క అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యనే ఎస్5 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా తారకరత్న సోషల్ మీడియాఓ పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నందమూరి హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ ను మరిపిస్తున్నాడు. బ్రౌన్ కలర్ సూట్ లో బ్లాక్ అండ్ వైట్ హెయిర్.. బ్లాక్ గాగుల్స్ తో అదరగొట్టేశాడు. సడెన్ గా తారకరత్నను చూస్తే కబాలి లో రజినీకాంత్ గుర్తొస్తున్నాడు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ లుక్.. నందమూరి హీరో ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఏమైనా కొత్త సినిమా కోసమా..? లేదా డిఫరెంట్ లుక్ కోసమా..? అనేది తెలియాలంటే తారకరత్న నోరు విప్పాల్సిందే.

Exit mobile version