జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’ కార్యక్రమం జరిగింది. రేపు అనగా మార్చ్ 2న తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్క్ 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న ‘పెద్ద కర్మ’ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ, విజయ సాయి రెడ్డి దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
Read Also: Anushka: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంది…
తారకరత్న మరణించిన తర్వాత నుంచి ప్రతి కార్యక్రమాన్ని బాలయ్య దగ్గర ఉండి జరిపిస్తున్నాడు. విజయ సాయి రెడ్డి కూడా తారకరత్న అంత్యక్రియల సమయంలో అలేఖ్య రెడ్డికి అండగా నిలుస్తూ పక్కనే ఉన్నాడు. పొలిటికల్ రైవల్స్ అయిన ఈ ఇద్దరూ ఇప్పుడు తారకరత్న పెద్ద కర్మని కూడా జరిపించే భాద్యతని తీసుకున్నారు. రాజకీయాలని పక్కన పెట్టి బాలకృష్ణ, విజయ సాయి రెడ్డి కలిసి తారకరత్న పెద్ద కర్మ చేస్తుండడం గొప్ప విషయం. తమ భాద్యతని నిర్వర్తిస్తున్న ఈ ఇద్దరినీ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసమే ఎన్టీఆర్ తన సినిమా పూజా కార్యక్రమాలని వాయిదా వేసుకోని యుఎస్ వెళ్లకుండా ఆగాడు. ఇది పూర్తి అవ్వగానే మార్చ్ 5న ఎన్టీఆర్ యుఎస్ వెళ్లనున్నాడు.