NTV Telugu Site icon

Taraka Ratna: కొడుకుని చూసి తల్లడిల్లుతున్న తారకరత్న తల్లిదండ్రులు

Tarakaratna Parents

Tarakaratna Parents

నందమూరి తారకరత్న మరణవార్త రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని కలచివేస్తుంది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, తారకరత్న ఎంతో మంచి వాడు, అతని మరణం బాధాకరం అని మాట్లాడుతున్నారు. ఇంతమంచి వ్యక్తి మరణిస్తే, ప్రతి ఒక్కరినీ అతని మరణం బాధిస్తూ ఉంటే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం మృతదేహాన్ని చూసేందుకు మోకిలకి కూడా రాలేదు. బాలయ్యనే చిన్న తండ్రి హోదాలో నిలబడి తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలని చూసుకుంటున్నాడు. అభిమానుల సందర్శనార్ధం తారకరత్న భౌతికాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. ఇక్కడికి వచ్చిన తారకరత్న పేరెంట్స్ ‘మోహనకృష్ణ, శాంతిమోహన్’లు కన్న కొడుకు భౌతికకాయాన్ని చూసి కనీటి పర్యంతం అయ్యారు. కొడుకుని కడసారి చూసిన శాంతి మోహన్, గుండె పగిలేలా ఏడ్చిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ చేస్తున్నాయి.

Read Also: Taraka Ratna: తారకరత్నని NBK108లో పెట్టమని బాలయ్య అడిగారు- అనీల్ రావిపూడి

Show comments