NTV Telugu Site icon

Nandamuri Traka Ratna: నారా లోకేష్ తో తారకరత్న భేటీ.. ఎమ్మెల్యేగా అక్కడినుంచే పోటీ..?

Tarakaratna

Tarakaratna

Nandamuri Traka Ratna: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తో నందమూరి తారకరత్న భేటీ అవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు ఆయన ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన తారకరత్న ఫ్యామిలీ విషయాలతో పాటు రాజకీయ పరమైనా చర్చలు కూడా సాగించినట్లు తెలుస్తోంది. ఇద్దరు బంధువులు, బావ బామ్మర్దులు కాబట్టి కలిసి ఉంటారు అని అనుకున్నా.. కొన్ని రోజుల క్రితం టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తారకరత్న తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉందని చెప్పడంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది. ఇక లోకేష్ తో భేటీ తరువాత తారకరత్న పోటీ విషయంలో క్లారిటీ వచ్చిందని చెప్పుకొస్తున్నారు. వీరి మాటల్లో ఎమ్మెల్యే టికెట్ విషయమూ చర్చకు వచ్చిందని, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేయడానికి సిద్దపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక ఈ భేటీలో తారకరత్న ఎక్కడ నుంచి పోటీ చేసేదీ ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎవరు పోటీగా దిగినా నందమూరి- నారా కుటుంబాల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల నందమూరి – నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొందరు చేసే వ్యాఖ్యలకు ప్రాముఖ్యం ఇవ్వవలసిన అవసరం లేదని తారకరత్న చెప్పినట్లు తెలిసింది. తారకరత్న ఇకనుంచి పూర్తిగా రాజకీయాల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న తారకరత్న.. ఇకనుంచి మరింత యాక్టివ్ గా ఉండనున్నాడట. మరి తారకరట ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాడు..? ఈసారి పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతాడో చూడాలి అంటున్నారు టీడీపీ అభిమానులు.