Site icon NTV Telugu

Tarakaratna: ఫిల్మ్ ఛాంబర్ కి తారకరత్న భౌతికకాయం…

Tarakaratna

Tarakaratna

నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి పర్వదిననా తుది శ్వాస విడిచారు. తిరిగి వస్తాడు అనుకున్న మనిషి అకాల మరణం నందమూరి అభిమానులని, కుటుంబ సభ్యులని, తెలుగు దేశం పార్టీ కేడర్ ని, సినీ పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేసింది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని సొంత ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకోని వచ్చారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి నుంచి అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్న బాలయ్య, మోకిల నుంచి తారకరత్న భౌతికకాయంతో పాటు ఫిల్మ్ ఛాంబర్ కి బయలుదేరాడు. మోకిల నుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తరలించే సమయంలో విజయ్ సాయి రెడ్డి కూడా బాలయ్యతోనే ఉన్నారు. అంబులెన్స్ లో తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకోని వచ్చారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని సాయంత్రం వరకూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఉంచి, సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరపనున్నారు.

Read Also: Taraka Ratna – NTR : ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలిచిన ఎన్టీఆర్

Exit mobile version