టాలీవుడ్ ఇప్పుడు రెండ్ బిగ్ మూవీస్ ను వెండి తెరపై చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మార్చ్ 11న విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కూడా మాములుగా లేదు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మేనియా ఎలా ఉందన్న విషయాన్నీ తాజాగా ఓ అభిమాని చేసిన పని చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అభిమానులు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ యూఎస్ లో మరోసారి ముందస్తు బుకింగ్ ప్రారంభమైంది. ఊహించినట్లుగానే గంటల్లోనే వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అక్కడ మార్చి 24 ప్రీమియర్ కాబోతోంది ఈ మూవీ.
Read Also : Radhe Shyam : కనీసం 50 రూపాయలన్నా పెట్టి సినిమా చూడండి… రిపోర్టర్ కు ప్రభాస్ పంచ్
ఇక విషయంలోకి వస్తే… టెక్సాస్, డల్లాస్‌లోని గెలాక్సీ థియేటర్‌లో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని 75 టిక్కెట్‌లను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. తారక్, చరణ్ అభిమానులు సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారనే దానికి ఇదే మంచి ఉదాహరణ. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ కానుంది.
