బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అల్లరి పిడుగు, వీరభద్ర సినిమాల్లో బాలయ్య తో రొమాన్స్ చేసి మెప్పించింది . ఇక ఈ సినిమాలు అమ్మడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడం తో, బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. మూవిస్ విషయం పక్కన పెడితే వివాదాస్పద మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్‌ల్లో పాల్గొనమని పదేపదే ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను ఎప్పుడూ తిరస్కరించానని ఆమె స్పష్టం చేశారు.
Also Read : Rashmika : బాలీవుడ్ సీక్వెల్‌లో రష్మిక మందన్న..
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ‘గత 11 ఏళ్లుగా బిగ్ బాస్ టీమ్ నన్ను సంప్రదిస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ ఓకే చెప్పలేదు. నేను నా సొంత ఫ్యామిలితో కూడా కలిసి ఉండను. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటాను? బిగ్ బాస్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, ఎప్పటికీ ఉండదు. వారు రూ.1.65 కోట్లు ఆఫర్ చేశారు. నా స్థాయిలోని మరో నటి కూడా అదే అమౌంట్ తీసుకుందని విన్నాను. కానీ నేను కచ్చితంగా నో చెప్పాను. ఆ షోలో మగవాళ్లు–ఆడవాళ్లు ఒకే హాల్‌లో పడుకుంటారు, గొడవలు పడతారు. ఒక మనిషితో ఒకే బెడ్‌పై పడుకునేంత చీప్ నేను కాదు. నా ప్రైవసీ నాకు చాలా విలువైనది. వాళ్లు నాకు ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం ఇస్తే, నేను అంతకంటే ఎక్కువ సంపాదించగలను” అని అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండటంతో.. చాలా మంది ఇలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తుంటే తను శ్రీ మాత్రం ఈ షో పై ఇలాంటి కామెంట్స్ చేస్తోంది అంటూ షాక్ అవుతున్నారు.
