Tanish: బిగ్ బాస్ లో హీరో తనీష్ చేసిన రఛహ్ అంతాఇంతా కాదు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక మంచి పేరునే సంపాదించుకున్నాడు కానీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయాడు. ఇక చాలా గ్యాప్ తరువాత తనీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంతేలే కథ అంతేలే’. సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ఠ రెండో హీరోగా నటిస్తున్నాడు. రిధిమ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి మేకర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన పాత్ర ఇది. ఇందులో హ్యూమన్ రిలేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.
ఇక చిత్ర దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ.. “రిధిమ క్రియేషన్స్ పతాకంపై నా డైరెక్షన్ లో ‘అంతేలే కథ అంతేలే’ సినిమా నిర్మిస్తున్నాం. సినిమా బండితో అందరినీ మెప్పించిన నటుడు వికాస్ వశిష్ట ఇంకా తనీష్ హీరోలుగా సెహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చేనెల షూటింగ్ వెళుతున్న ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి .ఈ చిత్రాన్ని అనంతరం, నల్గొండ, హైదరాబాద్ లల్లో మూడు షెడ్యూల్ లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నామని” తెలిపారు. మరి ఈ సినిమాతో తనీష్ మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తాడేమో చూడాలి.