నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ జనాల్లో ఒక రేంజ్ అంచనాలు క్రియేట్ చేసేశాయి. దానికి తోడు బంపర్ హిట్ లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ కావడంతో అటు సాయిపల్లవి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ రెట్టింపవుతాయి వస్తుంది.
Alsi Read:Kiara Advani: మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ ఆడియన్స్ ను హుషారెత్తించే అప్ డేట్ ఇచ్చారు ‘తండేల్’ మేకర్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేసిన చిత్ర యూనిట్.. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.మేకర్స్ దీనిని తాండల్ జాతర అని పిలుస్తున్నారు, వారు బహిరంగ కార్యక్రమానికి అనుమతి పొందగా, అన్నపూర్ణ స్టూడియోలో 7 ఎకరాల్లో ఇంటి లోపల ప్లాన్ చేస్తున్నారు.ఇక సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ఎదురైన పరాజయాల తర్వాత బన్నీ పాల్గొంటున్న తొలి పబ్లిక్ ఈవెంట్ ఇది. అయితే..
ఈ ఈవెంట్ ని ఫిబ్రవరి 1 అంటే ఈరోజు జరగాల్సింది. కానీ అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాని రేపటికి పోస్ట్ ఫోన్ చేశారు. దీని గురించి అధికారికంగా మూవీ టీం ప్రకటన ఇచ్చింది. ఈరోజు జరగాల్సిన ఐకానిక్ తాండల్ జాతర ఫిబ్రవరి 2కి మార్చబడింది.ఈవెంట్ చాలా మరపురాని క్షణాలతో, గొప్పగా వైభవంగా ఉండబోతుంది. ఈ సారి గురి తప్పేదేలే.. అంటూ పోస్ట్ లో పెర్కోన్నారు.