NTV Telugu Site icon

Nikhil: నిఖిల్ కు గట్స్ లేవు.. సినిమా రిలీజ్ తో అతడికేంటి పని.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Nikhil

Nikhil

Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 విజయఢంకా మోగిస్తున్న విషయం తెల్సిందే. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ హిట్ టాక్ ను అందుకొని కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు నిఖిల్, దిల్ రాజు ఫై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమకు థియేటర్లు ఇవ్వడం లేదని, తక్కువ థియేటర్లు ఇస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో దిల్ రాజును పిలిచి ఆయన వలనే సినిమా మంచిగా ఆడుతుందని, దిల్ రాజుకు థాంక్స్ చెప్పాడు. ఇక ఈ ఘటనపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ధ్వజం ఎత్తారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. “నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా బావుంది. కార్తికేయ 2 కు సరైన స్తానం ఇవ్వలేదు అంటే.. నిఖిల్ కు గట్స్ లేవు.. అసలు థియేటర్ల విషయంలో అతడికి ఏంటి పని..? అన్ని గట్స్ ఉంటే దొరికిన థియేటర్లో పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేకుండా రిలీజ్ చేయాలి.

థాంక్యూ సినిమా అప్పుడే నిఖిల్ ఎందుకు రిలీజ్ చేయలేదు.. మాచర్ల నియోజక వర్గం అప్పుడు ఎందుకు రిలీజ్ చేశాడు. అసలు అతడికేం సంబంధం. మాకు థియేటర్లు ఇవ్వలేదు.. వారు తీసేసుకున్నారు అని చెప్పడానికి.. నీకు సినిమా మీద నమ్మకం ఉంటే తక్కువ థియేటర్లో ఉన్నా రిలీజ్ చేసుకోవాల్సింది.. ఇప్పుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఇదే పని థాంక్యూ అప్పుడే చేసి ఉంటే.. రిజల్ట్ అప్పుడు కూడా ఇలాగే ఉండేది. కానీ ఆరోజు నీకు ఆ గట్స్ లేవు. ఇక ఇంత మాట్లాడక సక్సెస్ మీట్ కు దిల్ రాజును ఎందుకు పిలిచావ్.. మీరు ఇంటికి వెళ్లి పిలిచినందుకే ఆయన వచ్చినట్లు స్టేజి మీదే చెప్పాడు. అప్పుడు అది అబద్దమైతే.. లేదు నేను అలా చేయలేదు అని చెప్పగలరా..?. ఇవన్నీ అనవసరమైనవి.. సిల్లీ విషయాలు మాట్లాడుకోవడం తప్పు. ఇవాళ సినిమా సక్సెస్ అయింది.. ఒక చిన్న సినిమా సక్సెస్ అయినందుకు అందరం హ్యాపీగా ఉన్నాం. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో బాగా చేస్తోంది. హిందీలో ఊహించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తోంది. ‘పుష్ప’ మాదిరిగానే ‘కార్తికేయ 2’ కూడా సర్ప్రైజ్ చేసింది

Show comments