Tammareddy Bharadwaja Fires On Criticism Over RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బులేదో తమకిస్తే పది సినిమాలు ముఖాన కొడతామని ఓ మూవీ ఈవెంట్‌లో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్ల దగ్గర నుంచి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, నాగబాబు లాంటి ప్రముఖులు సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ఆర్ యూనిట్ అంత ఖర్చు చేసినట్టు నీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా? అని రాఘవేంద్రరావు ప్రశ్నిస్తే.. ‘నీ అమ్మ మొగుడు పెట్టాడారా రూ.80 కోట్ల ఖర్చు’ అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు. ఇందుకు ధీటుగానే తమ్మారెడ్డి స్పందించారు. తాను నోరు విప్పితే.. అందరి అకౌంట్లు బయటపడతాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ తప్పు చేయలేదు. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే, అందులో నుంచి ఒక క్లిప్పింగ్ ఆధారంగా నాపై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదు. రాజమౌళిపై ఈర్ష్యతో నేను అలా మాట్లాడాను అని అంటున్నారు. అసలు రాజమౌళి నాకు సమకాలీనుడే కాదు. నేను ఆ వ్యాఖ్యలు చేయడానికి రెండు రోజుల ముందు ఆర్ఆర్ఆర్‌ను ప్రశంసిస్తూ మాట్లాడాను. మరి దాని గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు? అసలు వీడికేం లెక్కలు తెలుసని కొందరు అంటున్నారు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు కానీ, నాకు చాలామంది అకౌంట్స్ తెలుసు. అవార్డులు, పదవుల కోసం ఎవరెవరు ఎవరెవరిని అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. వాటి గురించి నేనెప్పుడూ మాట్లాడను. ఒకవేళ నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి లాంటిది, నేను సినీ పరిశ్రమను గౌరవిస్తాం. అందుకే ఈరోజుకీ సంయమనంగా మాట్లాడుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు.
Allu Arjun: బన్నీకి భారీ పారితోషికం.. ప్రభాస్‌కి మించి?
అంతేకాదు.. కొందరు తనని అసభ్యంగా, నీచంగా తిడుతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసని.. ఎక్కడైనా నిజాలు మాట్లాడగలనని అన్నారు. నాలాగా ధైర్యంగా నిజం చెప్పగలరా? గతంలో రాజమౌళిని అభినందిస్తూ మాట్లాడింది మీకు కనిపించలేదా? ఎవరో ఏదో క్లిప్ పెట్టేసరికి తెలిసిందా? ఎప్పుడూ ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలని, ఎంతసేపు వాళ్లకు వీళ్లకు మర్దన చేయాలని చూసే మీరా నా గురించి మాట్లాడేది? అసలు నన్ను అనే హక్కు మీకుందా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే.. తిరిగి మొహం మీదే పడుతుందని చివర్లో చురకలంటించారు.