Site icon NTV Telugu

ThammaReddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ కు పెట్టిన ఖర్చుతో నేను 8 సినిమాలు తీసి ముఖాన కొడతా

Tammareddy

Tammareddy

ThammaReddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వివాదాలు కొత్త కాదు… విమర్శలు కొత్త కాదు. తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం ఆయనకు అలవాటు. ఇండస్ట్రీలో సమస్య ఏదైనా దానిమీద ఆయన చేసే వ్యాఖ్యలు ఎన్నో వివాదాలను తీసుకొచ్చి పెట్టాయి. ఇక అవన్నీ సరిపోవన్నట్టు ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారాడు. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ వేదికపై నిలబెట్టడానికి రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో టాలీవుడ్ అనేది అంతర్జాతీయ వేదికలపై ఎక్కువగా వినిపిస్తోంది. రేపో మాపో ఆస్కార్ వస్తుంది అనే తరుణంలో మనవారే.. వారిని కించపరుస్తున్నట్లు మాట్లాడడం ఎంతో బాధాకరమైన విషయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు ఇంతకు తమ్మారెడ్డి ఏమన్నారు అంటే..

Project K: అన్నా.. అదే చేత్తో కొంచెం ప్రభాస్ లుక్ ను కూడా

నేడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ” ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. మేము సమాజాన్ని మార్చాలని సినిమాలు తీయడం లేదు. మాకు నచ్చి సినిమాలు తీస్తున్నాం. మేము సమాజాన్నీ మార్చాలని చూస్తాం కానీ, సమాజాన్ని ఉద్దరించడానికే అయితే మేము పుట్టలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ్మారెడ్డిని తప్పు పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version