Alya Manasa: విడాకుల ప్రచారం.. అనూహ్యంగా స్కాంలో చిక్కుకున్న సీరియల్ నటి.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil TV serial Actress Alya Manasa named in new MLM scam:ఆలియా మానస తమిళ రాజా రాణి సీరియల్‌లో సెంబా పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. సీరియల్ అభిమానుల హృదయాలను ఆకట్టుకున్న ఆమె సీరియల్ హీరో సంజీవ్ హృదయాన్ని కొల్లగొట్టగా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. అయితే వీరిద్దరూ ఈ మధ్యవిడాకులు తీసుకోబోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఇద్దరూ కలిసి ఒక రిలే చేసి అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు అలియా పేరును ఉపయోగించుకుని ఎంఎల్‌ఎం సంస్థ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన కొందరు సెలబ్రిటీలకు ఫోన్ చేసి తమ కంపెనీలో అలియా మానస పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారని సమాచారం. దీంతో చాలా మంది అలియా మానసను ఫోన్‌లో సంప్రదించి ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు అడుగుతున్నారు.
Varun Tej: దేశభక్తి గలిగిన చిత్రాలల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా
Also Read
నేను ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టలేదని ఆలియా వారికి వివరించింది. ఇలా నిరంతర కాల్స్ రావడంతో అలియా తన భర్త సంజీవ్ తో కలిసి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన పేరు చెప్పగానే పుకార్లకు మోసపోవద్దని అభిమానులను సైతం ఆమె కోరింది. అలియా మానస, సంజీవ్, “మేము మా సీరియల్స్ తో సంపాదించిన మా స్వంత డబ్బుతో జీవిస్తున్నాము, మేము ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టము” అని వివరించారు. ఇల్లు, కారు, బైక్ ఇలా అన్నీ ఈఎంఐ ద్వారానే కొనుగోలు చేశాం.. ఇప్పుడు కూడా ఈఎంఐ కడుతున్నామని చెప్పారు. అలియా మానస ధనవంతురాలిగా, సంపన్నంగా ఉండటానికి కారణం ఎంఎల్‌ఎం కంపెనీలో పెట్టుబడి పెట్టడమేనని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని సంజీవ్, అలియా మానస సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!