Udhayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎం, హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ పేరు సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసే పోస్టులు, కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారి తీస్తాయి. అవతలి పార్టీ వాళ్లు ఉదయనిధి పోస్టులకు నానా రచ్చ చేస్తుంటారు. తాజాగా ఉదయనిధి అనుకోకుండా నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నివాశియ్ని కృష్ణన్ గ్లామర్ ఫొటోలను షేర్ చేశారు. కానీ వెంటనే గమనించి ఆ పోస్టును డిలీట్ చేశారు. అంతే కాకుండా శివాయిగ్ని పోస్టు కింద కామెంట్ సెక్షన్ ను కూడా ఆఫ్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది.
Read Also : Mega Heros : మెగా హీరోల అనుబంధం.. తమ్ముడికి అన్న ముద్దు
అవతలి పార్టీ వాళ్లు స్క్రీన్ షాట్లు కొట్టేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఇంకేముంది నెటిజన్లు ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. ఉదయనిధి కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా గతంలో వీరిద్దరి మధ్య ఏవేవో జరిగాయి అయి వీడియోలు బయటకు వదులుతున్నారు. దెబ్బకు డిప్యూటీ సీఎం పేరు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తోంది. ఆయన్ను ట్రోల్ చేసి చంపేస్తున్నారు. ఆమె త్వరలోనే పార్టీకిలో వస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈమె ఎవరో కాదు తమిళనాడు మూలాలు ఉన్న సింగపూర్ మోడల్. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొంది ఈ బ్యూటీ. అప్పటి నుంచి తమిళనాడులో ఆమె పేరు వినిపిస్తుంది.
Read Also : Samantha : మళ్లీ దొరికిపోయిన సమంత.. రాజ్ ఇంట్లో దీపావళి వేడుకలు
