Site icon NTV Telugu

Tamil Heros : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రెడ్ కార్పెట్ వేస్తున్న.. కోలీవుడ్ హీరోస్ !

Tilly Wood Hiros

Tilly Wood Hiros

ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో, బ్లాక్ బాస్టర్ హిట్‌లు కోడుతోంది టాలీవుడ్. చూపు చూసిన వారికి తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తుంది. అయితే ఒక్కప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకులతో, వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోలు ఆశపడేవారు. కానీ ఇప్పుడు బంతి మన చేతిలో ఉంది . తెలుగు ఫిల్మ్ మేకర్ల తో కొలబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి.

Also Read : Shoyu : నాగ చైత‌న్య రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక.. పోస్ట్ వైర‌ల్

ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మార్కెట్ కొల్లగొట్టిన అరవ హీరోలంతా కూడా టాలీవుడ్ దర్శకుల స్టామినాను చూసి వారితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మాణ సంస్థలే ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటంతో. వారు తెలుగు హీరోగా ఛేంజ్కాబోతున్నారు.  అల్‌రెడి టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘సార్’ మూవీ రూపంలో హిట్ అందుకున్న ధనుష్.. నెక్ట్స్ శేఖర్ కమ్ముల‌తో ‘కుబేర’ చేస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్‌గా స్టార్ హీరో సూర్య- వెంకీ అట్లూరీ కాంబోలో మూవీ లాంచ్ అయ్యింది. ఇక యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఎకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు .ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది టాక్. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ హీరోలు.. త్వరలో టాలీవుడ్ హీరోలుగా ఛేంజ్ అయిపోతారేమో చూడాలి.

Exit mobile version