NTV Telugu Site icon

Tiger 3: టైగర్ కి ఎందుకీ స్పెషల్ ట్రీట్మెంట్? ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న నెటిజన్లు

Tiger 3

Tiger 3

Tamil audience fires on government for special treatment to Tiger 3: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా తమిళనాడులో విడుదల చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అయింది. అదేమంటే టైగర్ 3 షోలు కొన్ని ఉదయం 7:10 గంటలకు కూడా పడ్డాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన తమిళ హీరోలు నటించిన జైలర్‌, లియో వంటి సినిమాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతించకపోవడం, ఇప్పుడు హిందీ హీరో సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతి ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనిదినాల్లో ఎలాంటి ప్రత్యేక షోలు అనుమతించకూడదని తమిళనాడు ప్రభుత్వం వాస్తవానికి నిర్ణయించింది . షోలు ఉదయం 9 గంటల నుంచి మాత్రమే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. లియో, జైలర్ వంటి పెద్ద చిత్రాలతో సహా ఇటీవలి రిలీజ్ అయిన సినిమాలన్నిటి విషయంలో అదే రూల్ ఫాలో అయ్యారు. ఈ క్రమంలో లియో నిర్మాతలు ప్రత్యేక అనుమతులపై హైకోర్టును కూడా ఆశ్రయించారు, కానీ అనుకూలమైన తీర్పు మాత్రం రాలేదు.

Tiger 3 Review: టైగర్ 3 రివ్యూ

జైలర్ మరియు లియో ప్రత్యేక షోలు లేనప్పటికీ భారీ బ్లాక్‌బస్టర్‌లుగా మారగా ఇప్పుడు టైగర్ 3కి తిరుపూర్‌లోని ప్రసిద్ధ శక్తి సినిమాల్లో ఉదయం 7 గంటలకు షోలు ఇవ్వడంతో వివాదం చెలరేగింది. ఈ మల్టీప్లెక్స్ ఉదయం 7:10 గంటలకు బుకింగ్‌లను ఎలా తెరిచింది, కోలీవుడ్ చిత్రాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ కి అనుమతి ఇవ్వనప్పుడు టైగర్ 3కి ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ప్రేక్షకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నిజానికి ఈరోజు వర్కింగ్ డే కాదు, అందుకే ఎర్లీ షోస్ కి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అన్ని సినిమాలు గురువారం, శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు అనుమతులు ఇచ్చి ఉండకపోవచ్చు అని కూడా వాదన వినిపిస్తోంది.