Site icon NTV Telugu

Mayilsamy: తారకరత్న మరణం మరవక ముందే మరో నటుడు మృతి

Mayilsamy

Mayilsamy

నందమూరి తారక రత్న మరణ వార్త మరిచిపోక ముందే దక్షిణాదిలో మరో నటుడు మరణించిన వర్త బయటకి వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో 200 పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు ఆర్. మయిల్‌సామీ తుది శ్వాస విడిచారు. 57 వయస్సులో అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 19 తెల్లవారుజామున మయిల్ సామీ మరణించారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో మయిల్‌సామీని కుటుంబ సభ్యులు ‘పోరూర్ రామచంద్ర’ ఆసుపత్రిలో అడ్మిట్ చెయ్యడానికి తీసుకోని వెళ్లారు. హాస్పిటల్ చేరుకునే లోపే మయిల్‌సామీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మయిల్ సామీ చివరి సారిగా ‘గ్లాస్‌మేట్స్’ అనే సినిమాకి డబ్బింగ్ చెబుతున్న వీడియోని షేర్ చేసిన ఈ విషయాన్ని తెలిపారు.

Read Also: Taraka Ratna: నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం- ప్రధాని మోదీ

1984లో మొదటిసారి తెరపై కనిపించిన మయిల్‌సామీ ఇప్పటివరకూ 200కి పైగా సినిమాల్లో నటించారు. 2022లో కూడా ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మయిల్‌సామీ అకాలమరణ వార్త వినీ తమిళ చిత్ర పరిశ్రమ, తమిళ సినీ అభిమానులు షాక్ అయ్యారు. మయిల్‌సామీ కామెడీ టైమింగ్ ఆయనకి ‘సీన్ స్టీలర్’ అనే బిరుదుని సంపాదించి పెట్టింది. ఎందుకంటే ఆయన ఏ సన్నివేశంలో నటించిన అందరి దృష్టిని ఆయన వైపే లాగేసుకుంటారు.

Exit mobile version