Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కనుందా..? అంటే నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక భయంకరమైన డ్యాన్సర్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగల హీరోయిన్ అంటే తమన్నా అని చెప్పుకోవాలి. ప్రస్తుతం జోరు తగ్గించిన ఈ బ్యూటీ బాలీవుడ్, టాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. ఇక గత కొన్నిరోజుల నుంచి తమన్నా పెళ్లి వార్తలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలో కూడా తమన్నా పెళ్లి వార్తలు వచ్చాయి కానీ.. అమ్మడు వెంటనే స్పందించి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చింది. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. అయితే ఈసారి ఆ వార్తలను అమ్మడు కూడా ఖండించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని అర్ధమవుతోంది.
ఇక ఈ మిల్కీ బ్యూటీని చేసుకునేది ముంబైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. తన పెళ్లి నిర్ణయం అంతా తల్లిదండ్రులకే వదిలేసినట్లు ఎన్నోసార్లు చెప్పిన తమ్ము.. ఇప్పుడు కూడా పెద్దలు తీసుకొచ్చిన అబ్బాయికే ఓకే చెప్పిందంట. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉండడంతో పెద్దలు కూడా ఈ సంబంధం ఖాయం చేశారట.. త్వరలోనే మిగిలిన వివరాలను తమన్నా పేరెంట్స్ బయటపెట్టనున్నారట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే తమన్నా నోరువిప్పాల్సిందే.