మిల్కీ బ్యూటీ తమన్నా మరో మంచి అవకాశం పట్టేసింది. మెగాస్టార్ సరసన మరో సినిమాలో నటించే ఛాన్స్ ఈ అమ్మడి సొంతమైంది. వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా “భోళా శంకర్”తో రొమాన్స్ చేయనుంది. గతంలో తమన్నా, చిరు “సైరా” చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు చిరంజీవితో జోడి కట్టడానికి తమన్నా ఓకే చెప్పిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం తమన్నాకు నిర్మాతలు భారీగా అడ్వాన్స్ చెల్లించారనే వార్తలు విన్పిస్తున్నాయి. జనవరిలో ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొంటుంది.
Read Also : నాగశౌర్య ఫామ్ హౌస్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” రూపొందనున్న విషయం తెలిసిందే. అజిత్ తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్ గా రూపొందుతోంది ఈ చిత్రం. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు సినిమా ముహూర్తం, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు “భోళా శంకర్” బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఎక్కువ భాగం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతుంది. చిరంజీవి సరసన జతకట్టనున్న హీరోయిన్ పేరును త్వరలో ప్రకటిస్తారు. ఈ సినిమాలో చిరంజీవి మళ్లీ మాస్ హీరోగా కనిపించనున్నారు. యువ సంగీత స్వరకర్త మహతి స్వర సాగర్ “భోళా శంకర్” కోసం సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
