Site icon NTV Telugu

Tamannaah special song: తెలుగులో మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా

Thamannah

Thamannah

మెగాస్టార్ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీని తెరకెకించడంలో అనిల్ రావిపూడి దిట్ట అని తెలిసిందే.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్‌ గురించి చెప్పక్కర్లెదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయిలో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట.

Also Read : Bhumi Pednekar : మాజీ సీఎం కొడుకుతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రేమాయణం? రెస్టారెంట్‌లో రెడ్ హ్యాండెడ్‌గా !

ఆ పాటలో గ్లామరస్ స్టార్ తమన్నా భాటియా స్టెప్పులేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమన్నా చేసిన “కావాలయ్యో కావాలయ్యో”, “డా డా డాస్ సూపర్ హిట్” లాంటి ఐటమ్ నంబర్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ క్రేజ్, ఎనర్జీని బట్టి ఈ సారి కూడా మెగాస్టార్‌తో జతకడుతున్న తమన్నా మాస్ ఆడియన్స్‌కి పక్కా ఫీస్ట్ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి షూట్ చేయడానికి యూనిట్ సిద్ధమవుతోందట. ఇక ఈ సాంగ్‌ను డిజైన్ చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ధ చూపాడని సమాచారం. సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా, కమర్షియల్ టచ్ కోసం ఈ మసాలా సాంగ్ అవసరమని భావించి దానిని చేర్చారట. ఈ పాటలో చిరంజీవి, తమన్నా ఇద్దరి ఎనర్జీ మేళవించి, దాన్ని థమన్ మ్యూజిక్‌తో మరింత పండుగగా మార్చబోతున్నారు. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version