NTV Telugu Site icon

Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్‌పై తమన్నా క్లారిటీ

Tamannaah On Vijay

Tamannaah On Vijay

Tamannaah Breaks Her Silence On Dating Vijay Verma: మిల్కీబ్యూటీ తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని.. కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. న్యూ ఇయర్ వేడుకల రోజు వీళ్లిద్దరు గోవాలో ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యాక, డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ మధ్య వీళ్లు రెగ్యులర్‌గా చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కడంతో, వీళ్లు లవ్‌లో ఉన్నారన్న వాదనలు మరింత బలపడ్డాయి. ఇక వీళ్లిద్దరు అఫీషియల్‌గా తమ ప్రేమను ప్రకటించడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. ఎట్టకేలకు తమన్నా ఓపెన్ అయ్యింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామన్న మాట వాస్తవమేనని స్పష్టం చేసింది.

Honey Rose: పూల మధ్య మెరిసిపోతున్న హనీ రోజ్..

ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ‘‘సహనటుడు అయినంత మాత్రాన ఆ వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారని నేను అనుకోవడం లేదు. నేను ఎంతోమంది నటులతో కలిసి నటించాను. నేను ఎవరితోనైనా ప్రేమలో పడాల్సి వస్తే.. అది మరింత వ్యక్తిగతమై ఉండాలి. అతనితో ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన భావన కలగాలి. విజయ్‌తో ఉంటే, నాకు అదే అనిపిస్తుంది. అతను ఓ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌ బంధం ఉంది. సినీ పరిశ్రమలో మంచి స్థాయిలో ఉన్నప్పుడు, కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి నుంచి విజయ్ నన్ను రక్షిస్తాడు. నేను నాకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఆ వరల్డ్‌లోకి అనుకోకుండా నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం’’ అంటూ చెప్పుకొచ్చింది.

Project k: ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా విడుదల వాయిదా పడబోతుందా..?

గతంలో ఓసారి ఈ డేటింగ్ రూమర్స్ గురించి అడిగినప్పుడు.. తమ మధ్య ఎలాంటి బంధం లేదన్నట్టుగా తమన్నా రియాక్ట్ అయ్యింది. తామిద్దరం కలిసి ఒక సినిమా చేశామని, అలాంటప్పుడు ఆ రూమర్స్ రావడం సహజమేనని చెప్పింది. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. కానీ.. ఇప్పుడు మాత్రం విజయ్‌తో తాను ప్రేమలో ఉన్నానంటూ వయ్యారాలుపోతూ చెప్పింది. ఇలా తమన్నా తన ప్రేమ వార్తల్ని కన్ఫమ్ చేయడంతో.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Show comments