NTV Telugu Site icon

Tamannaah Bhatia: మహిళా బిల్లు ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన మిల్కీ బ్యూటీ

Tam

Tam

Tamannaah Bhatia: నూతన పార్లమెంట్ భవనం సినీ తారలతో కళకళలాడింది. నేడు ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, దివ్య దత్తా భూమిక పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. ఇక వారందరిలో తమన్నా హైలైట్ గా నిలిచింది. రెడ్ కలర్ చీరలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అందంగా కనిపించింది. పార్లమెంట్ భవనం సందర్శనానంతరం ఆమె మహిళా బిల్లు ఆమోదంపై హర్షం వక్తం చేసింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు గురువారం రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టడం, ఆ తరువాత చర్చలు జరగడం.. చివరకు ఆ బిల్లుకు ఆమోదం తెలపడంతో అందరు హర్షం వ్యక్తం చేశారు.

Bigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?

ఇక దీనిపై తమన్నా మాట్లాడుతూ.. ” ఈరోజు చారిత్రాత్మకమైన రోజు, పార్లమెంటు కార్యక్రమాలను చూసే అవకాశం మాకు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా ముఖ్యమైనది, మహిళలు ఇతర రంగాలలో సాధించగలిగితే, వారు దేశాన్ని కూడా నడిపించగలరు, ఈ బిల్లు మనకు ఒక మైలురాయి” అని తెలిపింది. అంతేకాకుండా ఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తమన్నాతో పాటు దివ్యదత్తా కూడా మహిళా బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసారు.

Show comments