Site icon NTV Telugu

థై స్లిట్ డ్రెస్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు… పిక్స్ వైరల్

Tamannaah

Tamannaah

సినిమా ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్లుగా హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఇక దక్షిణాదిలోని ఫ్యాషన్ నటీమణులలో ఈ బ్యూటీ స్టైల్ ప్రత్యేకం. స్ట్రీట్ స్టైల్ నుండి గౌన్ల వరకు, చీర నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు తమన్నా ఫ్యాషన్ సెలక్షన్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. తమన్నాకు ఏసింగ్ కో-ఆర్డ్ సెట్స్ అండ్ కలర్ బ్లాకింగ్‌లో డాక్టరేట్ సర్టిఫికేట్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ బ్యూటీకి ఫ్యాషన్ పై ఇంత మంచి అభిరుచి ఉండి ఉంటుంది.

Read Also : ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ

తాజాగా తమన్నా ఆకర్షణీయమైన దుస్తులలో ఒక ఈవెంట్‌కు హాజరయ్యింది. ట్రాన్స్ వుమన్ సైషా షిండే రూపొందించిన ఎరుపు, నీలి రంగు థై స్లిట్ దుస్తులను తమన్నా ఎంచుకుంది. ఆమె పర్పుల్ స్లిట్ డ్రెస్‌తో ఆఫ్-షోల్డర్ టాప్‌ లో కార్సెట్‌తో కన్పిస్తున్న తమన్నా రరంగురంగు సీతాకోక చిలుకలా అద్భుతంగా కన్పిస్తోంది. స్టేట్‌మెంట్ నెక్‌పీస్‌తో, ఆమె మల్టీ కలర్ హీల్స్‌ను ఎంచుకుంది. ఇక మేకప్ విషయానికొస్తే స్మడ్జ్డ్ ఐస్, పీచ్ లిప్‌స్టిక్‌తో మెరిసిపోతోంది. ప్రస్తుతం తమన్నా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థై స్లిట్ డ్రెస్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Exit mobile version