Site icon NTV Telugu

Tamannaah Bhatia :పూర్తి కావచ్చిన తమన్నా ‘బబ్లీ బౌన్సర్‌’

Babli Bouncery

Babli Bouncery

తమన్నా బౌన్సర్ గా నటిస్తున్న ‘బబ్లీ బౌన్సర్’ షూటింగ్ పూర్తి కావచ్చింది. పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మధుర్ భండార్కర్ దీనికి దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీ అసోలా ఫతేపూర్‌కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని నటి తమన్నా తన ఇన్‌స్టాలో ప్రకటించింది. ఈ చిత్రం బౌన్సర్‌లకు ముందు ఆ తర్వాత తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తుందంటున్నారు. ఇందులో సౌరభ్ శుక్లాతో పాటు అభిషేక్ బజాజ్, సాహిల్ వైద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాన్సెప్ట్, కథ, స్క్రీన్ ప్లేను అమిత్ జోషి, ఆరాధనా దేబ్‌నాథ్, మధుర్ బండార్కర్ అందిస్తున్నారు. దీనిని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.

Exit mobile version