NTV Telugu Site icon

Thaman : తమిళ సినిమాలో యాక్టర్ గా తమన్.. ప్రోమో రిలీజ్

Thaman

Thaman

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్  తమన్ దే అగ్రస్థానం.  స్టార్ హీరోల సినిమాల దగ్గరనుండి యంగ్ హీరోల వరకు ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.  తమిళ యంగ్ హీరోలలో అథర్వ మురళికి మంచి గుర్తింపు ఉంది. అథర్వ హీరోగా తమిళ్ లో ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. డాన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.

నేడు వాలంటైన్స్ డే కానుకగా అథర్వ్ మురళీ హీరోగా వస్తున్న ఈ సినిమాకు ‘ఇదయమ్ మురళీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమో సూపర్బ్ గా ఉంది. ఈ చిత్రంలో తమన్ కీలకమైన క్యారక్టర్ చేయుయబోతున్నట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న తమన్ స్క్రీన్ పై చక్కగా కనిపించాడు అనే చెప్పాలి. తనదైన డైలాగ్ డెలివరీతో తమన్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నటిస్తూనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు తమన్. కెరిర్ తొలినాళ్లలో శంకర్ డైరేక్షన్ లో వచ్చిన బాయ్స్ సినిమాలో తమన్ నటించాడు. మళ్ళి ఇన్నాళ్లకు అథర్వ్ సినిమాలో నటించబోతున్నాడు యువ సంచలం తమన్. ఈ సినిమాలో అధర్వ్ కు జోడిగా కయాడు లోహర్ నటిస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా నందమూరి బాలయ్య నటిస్తున్నఅఖండ 2 ,పవన్ కళ్యాణ్ OG సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.

Also Read : Manchu Manoj : మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు