Site icon NTV Telugu

తాలీబన్స్ జస్ట్ కిడ్స్ : ఆర్జీవీ

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు తాలిబన్ల పాలన కావటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ వార్త అయింది. ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు సురక్షితంగా దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం తాలిబన్లు చేస్తున్న అరాచకాలు, వారు ఆడే ఆటలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. వరుసగా ట్వీట్ల మీద ట్వీట్ తో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని తనదైన స్టైల్ లో పోస్ట్ చేస్తున్నాడు. ‘కాబూల్‌లోని ఓ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఈ వీడియోను వర్మ షేర్ చేస్తూ.. ‘ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్’ అంటూ కామెంట్‌ చేశారు. మరో వీడియో పోస్ట్ చేస్తూ.. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని ఉద్దేశిస్తూ… ‘వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని వర్మ ట్వీట్‌ చేశాడు.

Exit mobile version