NTV Telugu Site icon

OG: ఒకరి తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారు ఏంటి సర్?

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తూ ఫ్యాన్ బాయ్ సుజిత్ ఒక సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై ఉన్నంత బజ్, ఈమధ్య కాలంలో అనౌన్స్ చేసిన ఏ సినిమాపై లేదు. అనౌన్స్మెంట్ వీడియో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే ఫోటో, షెడ్యూల్ స్టార్ట్ అయితే అప్డేట్, షెడ్యూల్ కంప్లీట్ అయితే అప్డేట్… ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ OG సినిమాపై బజ్ ని జనరేట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నా కూడా OG పైనే అందరి దృష్టి ఉందంటే, ఈ సినిమాని ఏ రేంజులో ప్రమోట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాస్టింగ్ విషయంలో కూడా OG సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది, ఇంటెన్స్ పెర్ఫార్మర్స్ OG కోసం ఆన్ బోర్డ్ వచ్చారు.

శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ లు రాకతో OG సినిమా రేంజ్ మరింత పెరిగింది. అయితే ఏ ఆర్టిస్ట్ OGలో జాయిన్ అయినా ఎలివేషన్స్ ఇవ్వడంలో మాత్రం ఒక్కరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఎవరికీ వారు ఫైర్ స్ట్రామ్ వస్తుంది అంటూ పీక్ స్టేజ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా అర్జున్ దాస్ కూడా OG గురించి సెన్సేషనల్ రిపోర్ట్ ఇస్తూ ట్వీట్ చేసాడు. OG నుంచి కొన్ని రషెష్ చూసిన అర్జున్ దాస్… విజువల్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్వాగ్ అండ్ డైలాగ్స్, సుజిత్ టేకింగ్ సూపర్బ్ గా ఉన్నాయి అంటూ అర్జున్ దాస్ ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ ట్వీట్ చూడగానే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ OG సినిమాని ఎలివేట్ చెయ్యడానికి ఒకరి తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారు. మరి సుజిత్ ఆ అంచనాలని మించేలా సినిమా చేస్తాడేమో చూడాలి.