NTV Telugu Site icon

Tabu: పెళ్లి పై మొట్టమొదటి సారిగా రియాక్ట్ అయిన హీరోయిన్ టబు..!

Untitled Design (1)

Untitled Design (1)

టాలీవుడ్‌ పాపులర్ హీరోయిన్‌ టబు గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో వెంకటేష్ సరసన ‘కూలి నెంబర్ వన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ, తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది టబు. కెరీర్ పరంగా ధూసుకుపోతున్నప్పటికి టబు పర్సనల్ లైఫ్ లో మాత్రం అభిమానులను నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 50 ఏళ్లు పైన అవుతున్నప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉంది..వివాహమంటే మాత్రం నో అంటుంది టబు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మ్యరెజ్ పై తన ఒపీనియన్ ని క్లియర్ గా చెప్పేసింది.. ‘తోడు లేకుండా ప్రస్తుతం బాగానే ఉన్నాను. మగాడి అవసరం కేవలం పడక గదిలో మాత్రమే ఉంటుంది. ఒక మగాడు బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటాడు.. కానీ లైఫ్ లో కాదు. అందుకే నాకు పెళ్లి పై ఎలాంటి ఆసక్తి లేదు.’ అంటూ వెల్లడించింది. టబు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన మాటలపై కొంతమంది పాజిటివ్‌గా స్పందించగా మరికొంతమంది ఈమెను విమర్శిస్తున్నారు. ‘53 ఏళ్లు అయినా తన అందంతో మగాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికి తరగని అందాన్ని మెయింటైన్ చేస్తుంది’ టబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ‘తోడు ఉండాలి మీకంటూ ఒక పర్యావరణ ఉంటే బాగుంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టబు మాటలు వింటుంటే సింగిల్ గానే ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.