Site icon NTV Telugu

ఓటీటీలోనే ‘రష్మి రాకెట్‌’.. డీల్ ఎంతంటే?

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘రష్మి రాకెట్‌’. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ క్రీడాకారిణి రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. ఈ చిత్రానికి ఆకాష్‌ ఖురానా దర్శకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్‌ విడుదల అవుతుందా.. అనే చర్చలకు కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘రష్మి రాకెట్‌’ సినిమా జీ5 లో దసరా కానుకగా విడుదల కానున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రూ.58 కోట్ల డీల్‌ కుదిరినట్టుగా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇక తాప్సీ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలున్న విషయం తెలిసిందే..!

Exit mobile version