Site icon NTV Telugu

భర్త చర్యను రేప్‌గా పరిగణించలేమన్న కోర్టు.. తాప్సీ కౌంటర్

భార్యతో భర్త బలవంతంగా శృంగారం చేయడాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌ గఢ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య మైనర్ (వయసు 18 ఏళ్లు లోపు) కాకుండా ఉన్నప్పుడు, ఆమెపై బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కాదని జస్టిస్ ఎన్‌కే చంద్రవన్షీ ధర్మాసనం తేల్చి చెప్పింది. అత్యాచారం అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, దీనిపై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ‘మనం వినాల్సిన వాటిలో ఇది ఒక్కట్టే మిగిలి ఉంద’ని వ్యాఖ్యానించింది. ఒక స్త్రీకి ఇష్టం లేకుండా శృంగారంలోకి బలవంతం చేయడం కచ్చితంగా అత్యాచారమే అంటూ తాప్సీ పరోక్షంగా పేర్కొంది. తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా స్పందిస్తున్నారు.

Exit mobile version