Site icon NTV Telugu

Tapsee: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్?

Taapsee Pannu Married Mathias Boe

Taapsee Pannu Married Mathias Boe

Taapsee Pannu married her Love Mathias Boe in an intimate Cermony: రాఘవేంద్ర రావు – మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమాలో హీరోయిన్‌గా నటించి ఫేమస్ అయిన నటి తాప్సీ తన ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో తాప్సీ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన నటించిన ఆమె ఆ తర్వాత అనేకమంది స్టార్స్ తో కూడా నటించింది. ఇక ఆమె కొన్ని సినిమాలు చేసి తమిళం ఆ తరువాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ సినిమా అవకాశాలు వెల్లువెత్తడంతో ఇక టాలీవుడ్ వైపు రాకుండా బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. తాప్సీ మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ 2013లో మొదటిసారి కలిశారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఆడేందుకు మథియాస్ భారతదేశానికి వచ్చినప్పుడు, తాప్సీ మథియాస్ పోను కలుసుకుంది.

Tollywood Shooting Updates: రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ, బాలయ్య, శర్వా.. ప్రభాస్ మాత్రం?

అప్పుడు ఏర్పడిన వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. 10 ఏళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వీరి వివాహం మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగినట్లు సమాచారం. తాప్సీ తమ వివాహాన్ని ప్రైవేట్ గా చేసుకోవాలని ప్లాన్ చేసిందని అందుకే సెలబ్రిటీలను ఆహ్వానించలేదని అంటున్నారు. తాప్సీ పెళ్లికి సినీరంగంలోని ఆమె సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అలాగే పెళ్లికి వచ్చిన వారి ఫొటోలు తీసి ప్రచురించకూడదని షరతు విధించినట్లు సమాచారం. దీని కారణంగా, తాప్సీ స్నేహితులు, స్నేహితురాళ్లు చాలా మంది వివాహానికి హాజరైనప్పుడు తీసిన చిత్రాలను పోస్ట్ చేయకుండా ఉన్నారు. దీంతో గత రెండు రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన సమాచారం బయటకు రాకపోగా.. ఇప్పుడు లీక్ అయింది. నటి తాప్సీ వివాహం సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version