NTV Telugu Site icon

Taapsee Pannu : నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు.. నా పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చు..

Whatsapp Image 2023 07 18 At 7.51.21 Am

Whatsapp Image 2023 07 18 At 7.51.21 Am

తాప్సి పన్ను..ఈ భామ ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తెలుగులో వరుసగా చేసింది సినిమాలు ఈ భామ. కానీ సక్సెస్ అంతగా దక్కకపోవడంతో బాలీవుడ్ కి చేరింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది.తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారింది.తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూనే.. గ్లామర్ తో కూడా అదరగొడుతోంది. ఈ మధ్య తాప్సి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. తాప్సి కెరీర్ మొదలైంది టాలీవుడ్ అయినప్పటికీ కూడా ఆమె టాలీవుడ్ దర్శకులని అక్కడి చిత్రాలని టార్గెట్ చేస్తూ తరచుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో హీరోయిన్లని గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటారు అంటూ తాప్సి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అయితే తాప్సిని ఎలాంటి ప్రశ్నను అడిగిన ఆమె సమాధానం ఎప్పుడూ సరిగ్గా ఉండదు. ఏదో ఒక వివాదం రగిలేలా తాప్సి తరచుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.

ఇటీవల తాప్సి ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించింది.. అలాగే ఫ్యాన్స్ కు సూచనలు కూడా చేసింది రొటీన్ క్వశ్చన్స్ అడగొద్దు కొద్దిగా కొత్తగా ట్రై చేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఓ అభిమాని తాప్సిని పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించడం జరిగింది.. ఈ ప్రశ్నకు తాప్సి ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది.’నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు.. కాబట్టి నా పెళ్లి ఇప్పుడే ఉండకపోవచ్చు’ అంటూ ఊహించని సమాధానం చెప్పింది. అయితే కొందరు బాలీవుడ్ హీరోయిన్లకు కౌంటర్ గానే తాప్సి ఈ వ్యాఖ్యలు చేసిందని తెలుస్తుంది.ఇటీవల ఇలియానా, అలియా భట్ మరియు నేహా ధూపియా లాంటి వారంతా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు.దీనితో అలియా భట్ రణబీర్ ని,నేహా ధూపియా అంగద్ బేడీని వెంటనే పెళ్లి చేసుకున్నారు. అయితే ఇలియానా మ్యారేజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దీనితో సదరు హీరోయిన్స్ కౌంటర్ గా తాప్సీ అలాంటి సమాధానం ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం తాప్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.