T Series to Setup a office at Hyderabad: టి సిరీస్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఆడియో క్యాసెట్లు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజుల్లో టి సిరీస్ ముందుగా ఈ సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ బిజినెస్ లోకి దిగింది. గుల్షన్ కుమార్ దీన్ని 1983లో స్థాపించారు. ఎక్కువగా హిందీ సినిమాలకు సంబంధించిన సౌండ్ ట్రాక్స్, పాప్ మ్యూజిక్ కి పాపులర్ అయిన టి సిరీస్ సంస్థ అతి తక్కువ సమయంలోనే ఇండియాలోనే అతిపెద్ద మ్యూజిక్ రికార్డు లేబుల్ గా ఇండియన్ మార్కెట్లో 35% షేర్ సంపాదించిన కంపెనీగా ఎదిగింది. నెమ్మదిగా సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ 89 లోనే పలు సినిమాల నిర్మించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తోంది.
Mvv Satyanarayana: నా ఫ్యామిలీ సేఫ్..విశాఖ ఎంపీ కీలక ప్రకటన!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ఇతర భాషల సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ వస్తున్న టి సిరీస్ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ తో ఆది పురుష్ సహా మరికొన్ని దక్షిణాది సినిమాలకు సంబంధించిన నటీనటులతో పనిచేస్తున్న ఈ సంస్థ టాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రణాళికల సిద్ధం చేసుకుంది. ఈ మేరకు హైదరాబాదులో ఒక ఏడంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కూడా సేకరించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఒక బిల్డింగ్ ని ఏర్పాటు చేసుకుని ముంబై తర్వాత సెకండ్ బ్రాంచ్ ఆఫీస్ గా హైదరాబాదుని తీర్చిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది సినిమాలు ఇండియన్ మార్కెట్ ని ఏలేస్తున్న నేపథ్యంలో ముంబైతో పాటుగా హైదరాబాదులో కూడా ఒక ఆఫీసు ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక గుల్షన్ కుమార్ కుమారులు కృషన్ కుమార్, భూషణ్ కుమార్ టీ సిరీస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు