Site icon NTV Telugu

‘విక్రాంత్ రోణ’ ఆడియో రైట్స్ ఎవరికంటే…

T Series and Lahari Music Acquires Music Rights of Vikranth Rona

శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. త్రీడీలో 14 భాష‌లు, 55 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్‌ స‌హ నిర్మాత. నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

Read Also : ఈ హీరోయిన్ నూ వదలని వర్మ.. “డియర్ మేఘ” అంటూ రచ్చ!

ఈ సినిమా హిందీ ఆడియో రైట్స్ ను టీ సీరిస్ సంస్థ సొంతం చేసుకోగా, దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ఆడియో హక్కుల్ని లహరి సంస్థ పొందింది. భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్న ‘విక్రాంత్ రోణ’కు ‘కె.జి.ఎఫ్.’ ఫేమ్ శివకుమార్ భారీ సెట్స్ వేయగా, విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీని అందించారు.

Exit mobile version