Site icon NTV Telugu

కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు

Lahari-and-Swetha-varma

కాస్ట్లీ బైకులు ఎక్కువగా అబ్బాయిలను ఆకర్షిస్తాయి. అయితే ఇప్పుడు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా బైకులు నడపడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ కాస్ట్లీ బైకులపై బిగ్ బాస్ భామలు కూడా మనసు పారేసుకోవడం ఆసక్తికరంగా మారింది. శ్వేత వర్మ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది. ఈ బైక్ విలువ రూ. 2 లక్షల కంటే ఎక్కువ. ఇక మరో ‘బిగ్ బాస్ తెలుగు 5’ లేడీ కంటెస్టెంట్ లహరి కూడా ఇటీవలే బిఎమ్‌డబ్ల్యూ వాహనాన్ని కొనుగోలు చేసింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో తాము కొన్న వాహనాలకు సంబంధించిన పిక్స్ షేర్ చేయగా, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version