NTV Telugu Site icon

Swayambhu: ఏపీ అడవుల బాట పట్టిన ‘స్వయంభు’

Swayambhu

Swayambhu

Swayambhu New Schedule to Start from Tomorrow in Maredumilli: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ తన మ్యాజిక్‌ మార్కు చూపించనున్నారు. ఆ మధ్య నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

Sai Dharam Tej: మంత్రిగా మామ బాధ్యతల స్వీకారం.. సైలెంటుగా సినిమా మొదలెట్టిన ధరమ్ తేజ్

ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. రిచ్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మారేడుమిల్లి అడవులలో ప్రారంభం కాబోతోంది. మారేడుమిల్లి అడుగులలో ఈ మధ్యకాలంలో చాలా పెద్ద తెలుగు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ షూట్ చేయడానికి తెలుగు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా అక్కడే షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి కొద్ది రోజులపాటు ఈ షెడ్యూల్ అక్కడే కొనసాగనుంది.