యంగ్ హీరో సుశాంత్ ఓటీటీ డెబ్యూ ‘మా నీళ్ళ ట్యాంక్’. జీ 5 ఒరిజినల్స్ కు చెందిన ఈ వెబ్ సీరిస్ ను ‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఉండే ‘మా నీళ్ళ ట్యాంక్’ రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. జూలై 15 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే శుక్రవారం సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది.
‘లీడర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్ ఈ వెబ్ సీరిస్ లో నాయికగా నటించింది. ఇతర ప్రధాన పాత్రలను సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోష, రామరాజు, దివి, అన్నపూర్ణమ్మ తదితరులు పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సీరిస్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని జీ 5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస్ మనీశ్ కాల్రా వ్యక్తం చేశారు.
